హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 7 జేసినవారి 2022 : బాలకృష్ణ (balakrishna) కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘అఖండ’(Akhanda). ప్రగ్యా జైశ్వాల్ కథానాయిక. డిసెంబరులో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు, బాలకృష్ణ కెరీర్‌లో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా రికార్డులు సృష్టించింది. కాగా, ‘అఖండ’ ఎప్పుడు ఓటీటీలో విడుదలవుతుందా? అని అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ+హాట్ స్టార్ తేదీని ప్రకటించింది. జనవరి 21వ తేదీ నుంచి ‘అఖండ’ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపింది. సంక్రాంతి కానుకగా జనవరి 14, లేదా 15వ తేదీన అందుబాటులోకి వస్తుందని అందరూ ఆశించారు. కానీ, ఓటీటీలో బాలయ్యబాబు నట విశ్వరూపం చూడాలంటే జనవరి 21వ తేదీ వరకూ వేచి చూడాల్సిందే!







