వేగవంతంగా అందరికీ ఇళ్ళు పథకం

UPDATED 24th OCTOBER 2017 TUESDAY 7:30 PM

పెద్దాపురం : తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో అందరికీ ఇళ్ళు పథకo నిర్మాణాలు వేగవంతమయ్యాయని రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక ఎడిబి రోడ్డుకు సమీపంలో నిర్మిస్తున్న అందరికీ ఇళ్ళు పథకంపై బ్యాంకు అధికారులు- లబ్దిదారులతో  అవగాహన సదస్సును మంగళవారం మంత్రి ప్రారంభించారు. అలాగే ఈ కార్యక్రమానికి గోదావరి అర్భన్ డెవలప్మెంట్ అధారిటీ  ఛైర్మన్ (గుడా) గన్నికృష్ణ అతిధిగా హాజరయ్యారు. సభకు పెద్దాపురం మునిసిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజు అధ్యక్షత వహించారు. రూ. మూడు లక్షల సబ్సిడీతో బ్యాంకు రుణంతో మూడు కేటగిరీలలో ఇళ్ళు నిర్మిస్తున్నట్టు మంత్రి చినరాజప్ప తెలిపారు. 1723 గృహ సముదాయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయని, 150 కోట్లతో అందరికీ ఇళ్ళు పధకాన్ని నిర్మిస్తున్నట్టు తెలిపారు. సంక్రాంతికి నాలుగైదు బ్లాక్ ల నిర్మాణం ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధం చేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఏడాదిలోగా మొత్తం 1723 గృహాలు పూర్తి చేస్తామని తెలిపారు. పెద్దాపురంలో మరో 1640 గృహాలు మంజూరుకు కృషి జరుగుతుందని, అర్హులందరికీ ఇళ్ళు మంజూరు చేస్తామన్నారు. నూటికి నూరు శాతం ఇళ్ళు ఇస్తామని పెద్దాపురాన్ని అభివృద్ధిలో ఓ స్వర్ణయుగం చేస్తానని చినరాజప్ప చెప్పారు. గుడా ఛైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ చినరాజప్ప పెద్దాపురం ఎమ్మెల్యే కావడం, డిప్యూటీ సిఎం అవ్వడం పెద్దాపురం ప్రజల అదృష్టం అన్నారు. పెద్దాపురంలో ఎన్నడూ లేని విధంగా పెండింగ్ సమస్యలు పరిష్కారానికి ప్రజా అవసరాలు తీర్చడంలో హోంమంత్రి చేస్తున్న కృషిని ప్రజలు మరువకూడదన్నారు. ఒక నెల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఇళ్ళు నిర్మాణం ప్రగతిని చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోందని, అలాగే  లోపలకు వెళ్ళి నిర్మాణాలు చూస్తే ఎంతో అద్భుతమైన కట్టడంగా నాణ్యతతో ఉన్నాయని ఆయన అన్నారు. అనంతరం గృహ నిర్మాణాల ప్రగతిని చినరాజప్ప, గన్ని కృష్ణ తిరిగి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఆర్డీవో విశ్వేశ్వరావు, మున్సిఅస్పల్ కమీషనర్ శేషాద్రి, లీడ్ బ్యాంకు మేనేజర్ సుబ్రహ్మణ్యం , ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, టిడిపి పట్టణ  అధ్యక్షుడు రంధి సత్యనారాయణ, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎ పి టెడ్ కో ఈఈ పి.రీటా, బ్యాంకు మేనేజర్ లు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.    
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us