UPDATED 22nd MAY 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలో గల కక్కిరెడ్డి చెరువులో మట్టిని ఆక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక యానాదుల ఫిషర్ మెన్ సంక్షేమ సేవా సంఘం ఫిర్యాదు మేరకు చెరువు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని విషయం తెలుసుకున్న మహిళా ఎస్.ఐ సిబ్బందితో చెరువు వద్దకు చేరుకొని పరిస్థితిని మంగళవారం పరిశీలించారు. ఎంతో కష్టపడి తాము చెరువును అభివృద్ది చేశామని, అయితే చెరువు గట్టుపై ఉన్న మట్టిని అక్రమంగా తరలిస్తున్నారని సంఘ నాయకులు ఆరోపించారు. సుమారు 400 కుటుంబాలు ఈ చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, ఇరిగేషన్ అధికారులు చెరువుగట్టుపై ఉన్న మట్టిని అక్రమంగా తరలించడానికి ప్రయత్నించడంతో తాము అడ్డుకున్నామని, మున్సిపాలిటీకి చెందిన చెరువు మట్టిని ఇరిగేషన్ అధికారులు ఎలా అమ్ముతారని వారు ప్రశ్నించారు.







