శ్రీ ప్రకాష్ లో ముగిసిన వేసవి శిబిరం

UPDATED 24th MAY 2017 WEDNESDAY 8:00 PM

పెద్దాపురం : స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ ఆవరణలో గత నెల రోజులుగా నిర్వహించిన వేసవి క్రికెట్ శిక్షణాశిబిరం బుధవారంతో ఘనంగా ముగిసింది. ఈ శిబిరంలో సుమారు 80 మంది విద్యార్థులు పాల్గొని శిక్షణ పొందారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ కె.ఎస్.కిరణ్ రాజు, సబ్ సెంటర్ ఇంచార్జి ఆవాల లక్ష్మీనారాయణ, హాజరై మాట్లాడుతూ విద్యార్థులు బాల్యం నుంచే క్రమశిక్షణతో పాటు క్రీడలవైపు ఆసక్తిని పెంచుకోవాలన్నారు. ముఖ్యంగా వేసవి క్రీడా శిక్షణాశిబిరాలను సద్వినియోగం చేసుకుని మంచి క్రీడాకారులుగా తయారుకావాలన్నారు. ఈ శిబిరంలో పెద్దాపురం, సామర్లకోట, జగ్గంపేట, పిఠాపురం, దివిలి తదితర ప్రాంతాల నుంచి  పలువురు విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఈ శిబిరానికి కోచ్ గా డి.దుర్గా ప్రసాద్ వ్యవహరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులను శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత చిట్టూరి విజయ ప్రకాష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డీన్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.  

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us