CM Jagan: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగన్‌ జన్మదిన వేడుకలు

అమరావతి (రెడ్ బీ న్యూస్) 21 డిసెంబర్ 2021: ఏపీ వ్యాప్తంగా సీఎం జగన్‌ జన్మదిన వేడుకలను వైకాపా నేతలు, కార్యకర్తలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేక్‌లు కట్‌ చేస్తూ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వేదపండితులు ఆయన్ను ఆశీర్వదించారు. సీఎంకు ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఎంపీలు వేమిరెడ్డి, బాలశౌరి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, వివిద శాఖల ఉన్నతాధికారులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాని, గవర్నర్‌ శుభాకాంక్షలు..

సీఎం జగన్‌కు ప్రధాని నరేంద్రమోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నేతలు ట్వీట్‌ చేశారు. భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. పూరీ జగన్నాథుడు, తిరుమల శ్రీవారి ఆశీస్సులతో జగన్‌ ఆయురారోగ్యాలతో ఉండాలని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us