హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 13 డిసెంబర్ 2021: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) నోటీసులు జారీ చేసింది. కాళేశ్వరం ముంపు ప్రభావంపై అధ్యయనం చేయాలని పేర్కొంది. ఎనిమిది వారాల్లోగా అధ్యయనానికి సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ముంపు అధికంగా ఉందంటూ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు అందింది. ప్రాజెక్టు వెనుకజలాల వల్ల 30 నుంచి 40వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పంటనష్టంతో రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదుదారుడి తరఫు న్యాయవాది వివరించారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.







