ప్రశాంతంగా గోదావరి బయో మేనేజెమెంట్ ప్రాజెక్టు ప్రజాభిప్రాయ సేకరణ

UPDATED 28th JULY 2017 FRIDAY 7:30 PM

రంగంపేట: తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం మర్రిపూడి గ్రామంలో నిర్మించనున్న గోదావరి బయో మేనేజెమెంట్ ప్రాజెక్ట్ నిర్మాణం పై నిర్వహించిన ప్రజాభిప్రాయసేకరణ శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. ఈ ప్రజాభిప్రాయసేకరణ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ. మల్లికార్జున సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసర గ్రామాల ప్రజలు నిర్భయంగా తమ అభిప్రాయాలను తెలియచేయాలని, ప్రజల అభిప్రాయాలను వీడియో ద్వారా చిత్రీకరించి సంబంధిత వీడియో ను కేంద్ర పర్యావరణ కార్యాలయానికి పంపడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ అభ్యంతరాలను నిరభ్యన్తరంగా తెలియ చేయవచ్చని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేస్ట్ మెటీరియల్ ను తీసుకు వచ్చి శుద్ధి చేసే ప్రాజెక్ట్ ని, దానికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియ చేశారు. అనంతరం మర్రిపూడి గ్రామానికి చెందిన సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ కాలుష్యం ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. మరో గ్రామస్థుడు పి. వెంకటేశ్వరావు మాట్లాడుతూ ఈ ఫ్యాక్టరీ నిర్మించడం పట్ల ప్రజలకు సదభిప్రాయం లేదన్నారు. గతంలో ఈ ప్రాంతంలో విషపూరిత ఫ్యాక్టరీలు నిర్మించిన కారణంగా రెండు చెరువులు కలుషితమయ్యాయన్నారు. అలాగే చినబ్రహ్మదేవం, ఆర్.బి.పట్నం గ్రామాలకు చెందిన ముత్యాల రాజబ్బాయి, ఆచంట రాజబాబు, కంచుమర్తి కాటంరాజు, పి. భద్రం రాంప్రసాద్, మాట్లాడుతూ ఈగలు, దోమలు ఫ్యాక్టరీల వల్ల రావడం జీవాధారమైన పశువులు అనారోగ్యంపాలవడం వ్యర్ధ పదార్ధాల వల్ల పరిసరాలు కలుషితమవుతాయని ఈ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ ప్రజల అభిప్రాయాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ రామారావు, పెద్దాపురం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు, తహసీల్దార్ కృష్ణ మూర్తి, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us