మంచిరోజున.... నేచురల్‌ స్టార్‌ నాని 28వ చిత్ర అప్‌డేట్‌ రాబోతోంది

రెడ్ బీ న్యూస్: మైత్రీమూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నాని.. తన 28వ చిత్రం చేయనున్నారు. ఈ విషయం చెబుతూ.. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ట్వీట్‌ చేసింది. ఈ దీపావళికి మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నట్లుగా చెబుతూ.. 'అంటే.. నాని 28, రేపు మంచి రోజట.. రేపు మాట్లాడుకుందాం..' అని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ట్వీట్‌లో పేర్కొంది. మరో ట్వీట్‌లో 'ష్‌.. మీరు సీక్రెట్‌గా ఉంచగలరా..? అయితే కొంచెం వెయిట్‌ చేయండి. అదీ ఎంత సేపో కాదు.. నాని 28వ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్తను దీపావళి కానుకగా.. నవంబర్‌ 13న తెలియజేయబోతున్నాము.." అని ట్వీట్‌ చేశారు. మొత్తంగా నాని 28కి సంబంధించి ఏదో బ్రహ్మండమైన వార్త రాబోతోందనే ఆసక్తిని క్రియేట్‌ చేయడంలో మైత్రీ సంస్థ సక్సెస్‌ అయ్యింది. ఏమిటా సీక్రెట్‌ అని నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. ప్రస్తుతం నాని 'టక్‌ జగదీష్‌' చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు.
ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us