30న కనకమహాలక్ష్మికి సహస్ర ఘాటాభిషేకం

విశాఖపట్టణం (రెడ్ బీ న్యూస్) 28 డిసెంబర్ 2021: మార్గశిర మాసోత్సవాల నేపథ్యంలో సోమవారం కనకమహాలక్ష్మి అమ్మవారికి భిన్న రకాల పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, వేదపండితులు అమ్మవారికి విశేష పంచామృతాభిషేకాలు చేశారు. ఈ సేవల్లో 10 మంది ఉభయదాతలు పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో శ్రీచక్రనవర్ణార్చన, లక్ష్మీహోమం, సప్తశతీ, వేద, మహా విద్యాపారాయణం జరిగాయి. 700 మంది భక్తులకు అన్నప్రసాద ప్యాకెట్లు పంపిణీ చేశారు. ★ ఈనెల 30న సాయంత్రం 4గంటలకు సహస్ర ఘటాభిషేకం నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ జ్యోతిమాధవి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కారణంగా మధ్యాహ్నం 3గంటల నుంచి అమ్మవారి దర్శనాలు నిలిపివేస్తామని, తిరిగి 7గంటలకు పునఃప్రారంభిస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us