హైబ్రిడ్ వెహికల్ ఛాలెంజ్ -2018లో ఆదిత్య విద్యార్థుల ప్రతిభ

UPDATED 23rd JANUARY 2018 TUESDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ విద్యార్థులు రూపొందించిన హైబ్రిడ్ వెహికల్ నోయిడాలోని గల్ గోటియాస్ యూనివర్సిటీ నిర్వహించిన హైబ్రిడ్ వెహికల్ ఛాలెంజ్ -2018లో పాల్గొని స్పార్క్ రైడర్స్ విద్యార్థి బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రశంసాపత్రం పొందినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు రూపొందించిన వాహనంలో ఇంజన్ తో పాటు మోటార్ కూడా అమర్చి రెండింటితో పనిచేయడం దీని విశిష్టత అన్నారు. వీడియో విభాగంలో 64కి 32 బృందాలు, సాంకేతిక పర్యవేక్షణలో 32కి 13 బృందాలు అర్హత సాధించగా, అందులో తమ సంస్థ విద్యార్థుల బృందం ఉత్తమ ప్రదర్శనకు ప్రశంసాపత్రం పొందడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ వి. శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, విభాగాధిపతి డాక్టర్ ఎ.శరవణన్ తదితరులు టీం  కో-ఆర్డినేటర్లు భీమేష్ రెడ్డి, పి. భరత్ కుమార్, విద్యార్థులను అభినందించారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us