Extra Ordinary Man : నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ నుంచి క్రేజీ అప్డేట్‌.. హార్ట్ ట‌చింగ్ మెలోడి..

Updated 30th July 2023 Sunday 9:05 pm

Danger Pilla Lyrical Promo : యంగ్ హీరో నితిన్ (Nithiin)న‌టిస్తున్న చిత్రం‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్(Extra Ordinary Man). వక్కంతం వంశీ (Vakkantham Vamsi) దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్‌(SreeLeela). ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. డిసెంబ‌ర్ 23న ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్లు ఇప్ప‌టికే చిత్ర బృందం తెలియ‌జేసింది.

తాజాగా చిత్ర బృందం మ‌రో క్రేజీ అప్డేట్‌ను ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ సింగిల్ రానుంది. డేంజ‌ర్ పిల్లా అంటూ సాగే పాటకు సంబంధించిన ప్రోమోను రేపు (జూలై 31 సోమ‌వారం) ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ పాట హార్ట్ ట‌చింగ్ మెలోడిగా ఉండ‌నున్న‌ట్లు చెప్పింది. ఈ సినిమాకి హారీస్‌ జైరాజ్‌ సంగీతాన్ని అందిస్తుండ‌గా శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వెంకీకుడుముల ద‌ర్శ‌క‌త్వంలో VNRTrio వ‌ర్కింగ్ టైటిల్‌తో తెర‌కెక్కుతున్న సినిమాలోనూ నితిన్ న‌టిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై నవీన్‌ యేర్నేని, వై రవి శంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీత ద‌ర్శ‌కుడు. క‌న్న‌డ అందం ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని చిత్ర బృందం ఎప్పుడో తెలియ‌జేసింది. అయితే.. ఇటీవ‌ల ఈ సినిమా ఆమె త‌ప్పుకుంద‌ని వార్తలు వినిపించాయి. దీనిపై చిత్ర బృందం ఇంకా స్పందించ‌లేదు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us