UPDATED 1st SEPTEMBER 2017 FRIDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల లో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం స్వచ్చంధ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు ప్రారంభించి మాట్లాడారు. తలసీమియా వ్యాధిగ్రస్తులకు నిరంతరం అవసరమైన రక్తాన్ని అందించేందుకు తమ వంతు సహకారాన్నిఅందిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తదానంతో మరొకరి ప్రాణాలను కాపాడవొచ్చని పేర్కొన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్.శంభూ ప్రసాద్ మాట్లాడుతూ తమ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విభాగం రోటరీక్లబ్, ప్రకృతిక్లబ్ సహకారంతో ప్రతీ సంవత్సరం తమ కళాశాలలో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు కాకినాడ వైద్యాధికారి దుర్గారాజు వైద్య సహకారాన్ని అందచేశారని తెలిపారు. అలాగే ఈ శిబిరంలో సుమారు 150 మంది విద్యార్థులు రక్తదానం చేశారు. ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారులు సి.రాజశేఖర్ ఫనీంద్ర, బి.సుధీర్, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు ఆర్.గుణ సాయి తేజ, కె.వి.దొర, జె.సామ్యూల్, మోహనచంద్ర, నిఖిల్ సూర్య ఈ శిబిరంలో తమ సేవలందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎం.వి. హరనాథబాబు, డాక్టర్ రఘురాం, వైస్ ప్రెసిడెంట్ సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ డాక్టర్ జి. నరేష్, విభాగాధిపతులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.







