UPDATED 7th AUGUST 2017 MONDAY 6:00 PM
రాజమహేంద్రవరం: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు రాజమహేంద్రవరంలో ఉన్న ఎ వై ఎస్ కె విద్యాసంస్థల ప్రాంగణం లో సోమవారం స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో ఉన్న పిచ్చి మొక్కలను, తుప్పలను తొలగించారు. అలాగే భవనంలో బూజులను తొలగించి సుందరంగా తీర్చిదిద్దారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు ఈ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడం పలువురిని ఎంతగానో ఆకట్టుకుంది. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లను ఆదిత్య కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఎ వై ఎస్ కె విద్యా సంస్థల ప్రతినిధులు అభినందించారు.







