ఉద్యానవన పంటలు పండించే రైతులకు ప్రోత్సాహం

* జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి
* పెద్దాపురం, చినబ్రహ్మదేవంలో క్షేత్ర పరిశీలన

UPDATED 4th DECEMBER 2019 WEDNESDAY 6:00 PM 

పెద్దాపురం(రెడ్ బీ న్యూస్): ఉద్యానవన పంటలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు జిల్లాలో అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి తెలిపారు. పెద్దాపురం పట్టణంలోని కొండపల్లి వెంకటేశ్వరరావు రైతుకు చెందిన పామాయిల్, వంగ తోటలను ఆయన బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఉపయోగించకుండా నోయిడాలోని ఆర్గానిక్ రీసెర్చ్ సెంటర్ లో తయారైన వేస్టు డికంపోజర్ వినియోగించి అధిక దిగుబడులు సాధించడం ప్రశంసనీయమని అన్నారు. పామాయిల్ తోటలలో కమ్మలు, చాక్ కట్టర్లతో ముక్కలుగా చేసి చెట్టు మొదలులో వేసి దానిపై వేస్టు డికంపోజర్ పిచికారీ చేయడం ద్వారా 40 రోజుల్లో కంపోస్టుగా మారి బలాన్నిస్తుదని కలక్టర్ కు వివరించారు. రెండు సంవత్సరాల వయస్సు గల పామాయిల్ తోట ఎకరానికి 9 నుంచి 10 టన్నుల దిగుబడి సాధించిన రైతు చేస్తున్న వ్యవసాయ విధానాన్ని కలక్టర్ అభినందించారు. ఒక ఎకరంలో అంటు కట్టిన వంగ నారు డ్రిప్, మల్చింగ్ షీట్ వేసి సాగు విధానాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు. వంగలో కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ నాణ్యమైన దిగుబడులు సాధించడం రైతులకు లాభసాటిగా ఉంటుందని, ఈ విత్తనాలను ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం నుంచి తెచ్చి సాగు చేస్తున్నట్లు కలక్టరుకు రైతులు వివరించారు. అలాగే చినబ్రహ్మదేవం గ్రామంలో పోలీ హౌస్ లో సాగులో ఉన్న తెల్ల చామంతి పూల తోటను ఆయన సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవనశాఖ పిడి ఏపిఎంఐపి  డాక్టర్ ఎస్. రామ్మోహనరావు, ఎడి బి.వి. రమణ (కాకినాడ), పెద్దాపురం ఉద్యానవన శాఖాధికారిణి సుజాత, 
విహెచ్ఏ ఎం. చిలకమ్మ, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us