పెద్దాపురం, 27 మే 2020 (రెడ్ బీ న్యూస్) : మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు బుధవారం
అంకురార్పణ చేశారు. వచ్చే నెల 21 నుంచి ప్రారంభం కానున్న అమ్మవారి జాతర
మహోత్సవాలను పురస్కరించుకుని పందిరి రాట ముహూర్త కార్యక్రమాన్ని వేదపండితులు బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ అసిస్టెంట్ కమీషనర్ కె. విజయలక్ష్మీ ఆధ్వర్యంలో భౌతిక దూరం పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. వచ్చే ఆషాఢమాసంలో జరగనున్న అమ్మవారి జాతరను పురస్కరించుకుని అమ్మవారి తొలి గరగలను
తీయడం జరిగిందని ఆలయ అసిస్టెంట్ కమీషనర్ తెలిపారు. ఈకార్యక్రమంలో వేదపండి
తులు చిట్టెం హరిగోపాల శర్మ,
రాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.