హైదరాబాద్ (రెడ్ బీ న్యూస్) 16 డిసెంబర్ 2021: ఔటర్ రింగ్‌రెడ్డును మరిపించేలా ప్రాంతీయ రింగ్‌రోడ్డును నిర్మి్స్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పటాన్‌చెరు ఇంటర్‌ఛేంజ్ వద్ద ఔటర్ రింగురోడ్డుపై ఎల్ఈడీ విద్యుత్ దీపాలను కేటీఆర్ ప్రారంభించారు. 2018లో 22 కి.మీ. మేర ఔటర్‌పై విద్యుద్దీపాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మిగిలిన 136 కి.మీ. పరిధిలో రూ.100.22 కోట్లతో చేపట్టిన ఈ ఎల్‌ఈడీ లైట్లను ఇవాళ కేటీఆర్ ప్రారంభించారు.







