ఢిల్లీ (రెడ్ బీ న్యూస్) 4 జనవరి 2022 : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండో రోజు దిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ ఉదయం కేంద్ర రహదారులు, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రహదారుల నిర్మాణం, జాతీయ రహదారుల విస్తరణపై చర్చించారు. తీర ప్రాంతం వెంబడి నాలుగు లైన్ల రహదారులు నిర్మాణం చేపట్టాలని కేంద్రమంత్రిని జగన్ కోరారు. వీటితో పాటు విశాఖ- భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం, విజయవాడ తూర్పు హైవే ఏర్పాటుపై కేంద్రమంత్రితో చర్చించారు. పెండింగ్ ప్రాజెక్టులకు త్వరగా అనుమతి ఇవ్వాలని గడ్కరీకి సీఎం వినతిపత్రం అందజేశారు.







