విద్యార్థుల ఆలోచనలకు హద్దులు ఉండకూడదు

UPDATED 14th NOVEMBER 2017 TUESDAY 7:00 PM

పెద్దాపురం: విద్యార్థుల ఆలోచనలకు హద్దులు ఉండకూడదని పలువురు వక్తలు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో సోషల్ మీడియా ఫర్ సొసైటీ ఆధ్వర్యంలో స్థానిక లూథరన్ హైస్కూల్లో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా తెలుగు అధ్యాపకుడు డాక్టర్ జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ విద్యార్థులకు స్వేచ్చాయుత విద్యా విధానం అవసరం అని, జ్ఞానం పలు రూపాల్లో నేర్చుకుంటారని, అందులో పావు వంతు మాత్రమే పాఠ్యపుస్తకాల్లో అందుతుందన్నారు. దానికోసం ఒత్తిడి పెంచే ప్రయత్నాలు తగవన్నారు. ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలన్నారు. లూథరన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు నళిని మాట్లాడుతూ పిల్లల ఆలోచనలు తెలుసుకోవడానికి ఎస్సెమ్మెస్ చేసిన ప్రయత్నం అభినందనీయమన్నారు. మూస పద్ధతిలో కాకుండా భిన్నంగా ఆలోచనలు ఉండాలన్నారు. అనంతరం "నేటి విద్యా విధానం-పిల్లల ఆలోచనలు" అన్న అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలకు అతిధుల చేతుల మీదుగా బహుమతులు అందచేశారు. ఈ పోటీల్లో తెలుగు మాధ్యమం సీనియర్లు షేక్ నజ్మీరా (ప్రభుత్వ బాలికోన్నత   పాఠశాల), పి. పూర్ణ మహాలక్ష్మి (ట్రినిటీ హైస్కూల్), కాళ్ల సత్య (సాగర్ మునిసిపల్ హై స్కూల్) వరుసగా బహుమతులు అందుకున్నారు. జూనియర్స్ లో టి. రేణుకాదేవి (జెఎన్ఎం హైస్కూల్), ఎం. భీమేశ్వర (జె ఎన్ ఎం స్కూల్), ఎన్. జాహ్నవి సింధు (జె ఎన్ ఎం స్కూల్) తొలి మూడు స్థానాలు దక్కించుకున్నారు. ఇంగ్లీష్ మీడియం సీనియర్స్ లో పి. సిద్ద్విని (నారాయణ), ఎ. వేదవల్లిక (జె ఎన్ ఎం), వైవిఎస్ కార్తికేయ (లెమ్స్) జూనియర్స్ లో ఎ. హర్షిత లక్ష్మీసాయి (లెమ్స్), జి. రంగబాబు (ట్రినిటీ), కృపా హరితారాణి (లెమ్స్) వరుస స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు మెమోంటోలతో పాటు భగత్ సింగ్ వీలునామా పుస్తకం, ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమానికి ఎస్ ఎం ఎస్ పెద్దాపురం ప్రతినిధి ముక్తర్ అలీ అధ్యక్షత వహించారు. వంగలపూడి శివకృష్ణ, వంగలపూడి సురేష్, బళ్లమూడి హరికృష్ణ, శ్యామ్ తాళ్లూరి, సుధాకర్ దేవరకొండ, బాబ్జి, సాయి నారాయణ, భాస్కర్ రావు, కంచుమర్తి కాటంరాజు, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us