ప్రగతి ఎన్.ఎస్.ఎస్ విభాగంచే జన్మభూమి-మా ఊరు నిర్వహణ

UPDATED 4th JANUARY 2018 THURSDAY 8:00 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ విభాగం "జన్మభూమి-మా ఊరు" కార్యక్రమంలో భాగంగా స్థానిక జెడ్.పి. హైస్కూల్ విద్యార్థులకు వివిధ అంశాలపై పోటీలు నిర్వహించి ఈనెల ఐదవ తేదీన విజేతలకు బహుమతులు అందచేస్తారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ తమ కళాశాల ఎన్.ఎస్.ఎస్. విభాగం విద్యాభివృద్ధిలో భాగంగా స్థానిక పాఠశాలలో జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. కాకినాడ జె.ఎన్.టు.యూ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ వి.ఎస్.ఎస్. కుమార్, రెక్టార్ డాక్టర్ కె. పూర్ణానంద్, ఎన్.ఎస్.ఎస్ కో-ఆర్డినేటర్ డాక్టర్ కె. శ్రీకుమార్, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, సూరంపాలెం సర్పంచ్ కె.రాజా, ఎం.పి.టి.సి కె. చిన్నిబాబు, గండేపల్లి ఎం.ఈ.వో నాయక్ తదితరులు పాల్గొని విజేతలకు బహుమతులు అందచేయనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మేనేజ్మంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టరు కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, కళాశాల సిబ్బంది తమ ఆనందాన్ని తెలియచేశారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us