సమస్యల పరిష్కారానికే ప్రజావాణి

UPDATED 29th MAY 2017 MONDAY 5:00 PM

కాకినాడ: ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలక్టర్ కార్తికేయ మిశ్రా పేర్కొన్నారు. దీనిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ శాఖల జిల్లా అధికారుల సమక్షంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 406  అర్జీలను స్వీకరించి వాటిపై సత్వర పరిష్కారం చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అర్జీలను స్వీకరించేందుకు ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. కాకినాడ లో గృహాల మంజూరు కోసం 1500 మంది గతంలో సొమ్ము చెల్లించారని, వారిలో ఇటీవల లాటరి ద్వారా 816 వందల మందిని ఎంపిక చేశామని ఇంచార్జి హౌసింగ్ పిడి జె. రాధాకృష్ణ మూర్తి కలక్టర్ కు వివరించారు. దీంతో ఆయన స్పందిస్తూ గృహాల మంజూరు కోసం మిగిలిన వారి వివరాలు సేకరించాలని, అదే విధంగా వారికి గృహనిర్మాణం కోసం నెల రోజుల్లో స్థలాన్ని కేటాయించాలన్నారు. గృహాల మంజూరు కోసం రాజమహేంద్రవరం నుంచి వచ్చిన అర్జీదారులతో  వచ్చే సోమవారం నుంచి రాజమహేంద్రవరంలో గృహ సమస్యల పై ప్రజావాణి నిర్వహిస్తామన్నారు. అలాగే జాయింట్ కలెక్టర్ ఎ.మల్లికార్జునకు పలువురు విజ్ఞాపనలు అందచేశారు. ఎస్.సి లబ్ధిదారులకు రుణాలు చెల్లింపులలో జరుగుతున్న జాప్యం పై లబ్ధిదారులు చేసిన ఫిర్యాదును దృష్టిలో ఉంచుకుని అర్హులైన లబ్దిదారులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయడంలో ఆలస్యం తగదని రుణాల మంజూరు విషయంలో ఆంధ్రాబ్యాంక్ ఎల్ డి ఎం, ఎస్ సి  కార్పొరేషన్ సమన్వయముతో తగుచర్యలు తీసుకోవాలన్నారు. అలాగే వేసవి నేపథ్యంలో అక్షర పాఠశాల  జూన్ ఒకటి నుంచి నిర్వహించే ప్రయత్నం జరుగుతోందని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదుపై కలక్టర్ స్పందించారు. వేసవిలో తరగతులు నిర్వహించకూడదని వేసవి సెలవులు అనంతరం జూన్ 12 నుంచి మాత్రమే తెరిచేలా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు ఖచ్చితం గా అమలు చేయాలని ఆదేశించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us