ముంబయి (రెడ్ బీ న్యూస్) 29 డిసెంబర్ 2021: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగి చివరకు నష్టాల్లో ముగిశాయి. ఉదయం ఊగిసలాట మధ్య ప్రారంభమైన సూచీలు రోజంతా అదే బాటలో పయనించాయి. ఒమిక్రాన్ భయాలు, అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.
సూచీల పయనం సాగిందిలా..
ఉదయం సెన్సెక్స్ 57,892.31 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. అక్కడి నుంచి ఊగిసలాటలో పయనించిన సూచీ 58,097.07 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 90.99 పాయింట్ల నష్టంతో 57,806.49 వద్ద ముగిసింది. 17,220.10 పాయింట్ల వద్ద ప్రారంభమైన నిఫ్టీ ఇంట్రాడేలో 17,285.95-17,176.65 మధ్య కదలాడింది. చివరకు 19.65 పాయింట్లు నష్టపోయి 17,213.60 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.72 వద్ద నిలిచింది.







