UPDATED 8th JANUARY 2018 MONDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలకు వాలీబాల్ జట్టు కాకినాడ ఐడియల్ కళాశాలలో నిర్వహించిన యువమహోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరచి రన్నర్-అప్ గా నిలిచి ట్రోఫీ గెలుపొందినట్లు ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. అలాగే వైజాగ్ విజ్ఞాన్ లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలు యువతరంగ్ లో నిర్వహించిన వాలీబాల్ పోటీల్లో సైతం తమ కళాశాల జట్టు సభ్యులు ప్రతిభ కనబరిచి రన్నర్-అప్ ట్రోఫీ, నాలుగువేలు నగదు బహుమతి గెలుపొందారని ఆయన తెలిపారు. విజేతలైన జట్టు సభ్యులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్స్ ప్రొఫెసర్ వి.శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, ఫిజికల్ డైరెక్టర్ సి.హెచ్. మురళీమోహన్, తదితరులు అభినందించారు.







