అమరావతి (రెడ్ బీ న్యూస్) 27 డిసెంబర్ 2021: రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో లబ్ధి పొందని వారికి ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అలాంటి వారందరికీ ప్రయోజనం కలిగించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో 18.48 లక్షల మందికి మంగళవారం రూ.703 కోట్లు జమచేయనున్నట్టు ప్రకటించింది. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదును జమచేయనున్నారు. అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాలు అందని వారికి లబ్ధిచేకూర్చనున్నారు. సంక్షేమ పథకాలు అందనివారికి ఏటా జూన్, డిసెంబర్‌లో లబ్ధిచేకూర్చనున్నట్టు ప్రభుత్వం తెలిపింది.







