ఆదిత్యలో మహిళా హక్కుల చట్టాలపై అవగాహనా సదస్సు

UPDATED 23rd NOVEMBER 2017 THURSDAY 7:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో జాతీయ మహిళా కమిషన్ సౌజన్యంతో మహిళా హక్కులు- చట్టాలు అనే అంశంపై గురువారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమం కో ఆర్డినేటర్ డాక్టర్ పి. హేమలత మాట్లాడుతూ సృష్టిలో స్త్రీ జన్మ ఎంతో మహోన్నతం, శక్తివంతమైనదని, స్త్రీ అన్ని రంగాల్లో విజయపథాన పయనించినపుడే దేశం ఎంతో పురోభివృద్ధి సాధిస్తుందన్నారు. అనంతరం మహిళా హక్కులు- చట్టాలు అనే అంశంపై విద్యార్థులకు ఐచ్ఛిక విధానంలో నిర్వహించిన పరీక్షలో 110 మంది విద్యార్థులు పాల్గొనగా, విశేష ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వివిధ విభాగాల శాఖాధిపతులు, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us