ఆదిత్యలో ముగిసిన జాతీయస్థాయి వర్క్ షాప్

UPDATED 23rd DECEMBER 2017 SATURDAY 7:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ క్యాంపస్ లో ఎక్స్ పెరిమెంటల్  టెక్నిక్స్ ఇన్ వెల్డింగ్ టెక్నాలజీ పేరిట డాక్టర్ టి.శ్రీహరి ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయస్థాయి వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలలు, ఇతర రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్రొఫెసర్లు పాల్గొన్న ఈ వర్క్ షాప్ లో వివిధ రకాల వెల్డింగ్ ప్రక్రియలు, వెల్డింగ్ చేయడంలో మెళకువలు, అలాగే అండర్ వాటర్ లో షిప్పులు, బోట్లు మొదలైనవి వెల్డింగ్ చేసేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, వైస్ ప్రిన్సిపాల్స్, మెకానికల్ విభాగం హెచ్ వో డీలు తదితరులు పాల్గొన్నారు.        

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us