గిరిజనుల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలి

* ఐటీడీఏ పీవో ప్రవీణ్ ఆదిత్య 

UPDATED 6th JULY 2020 MONDAY 6:00 PM

రంపచోడవరం(రెడ్ బీ న్యూస్): గిరిజనుల ఆరోగ్య పరిరక్షణ పట్ల సకాలంలో స్పందించి తగిన వైద్య సేవలు అందించి వారి ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించాలని సబ్-కలెక్టర్, ఐటీడీఏ ఇంఛార్జ్ పీవో ప్రవీణ్ ఆదిత్య పేర్కొన్నారు. మాతా శిశు మరణాలు నివారణ, ఇమ్యూనైజేషన్ కార్యక్రమాలు, గర్భిణీలు నమోదు, వివిధ రకాల ఆన్ లైన్ డేటాలు నిర్వహణ ద్వారా సరైన రీతిలో వైద్య సేవలు అందించడం తదితర అంశాలపై ఐటీడీఏ పరిధిలోని సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యాధికారులు, ఎంపిహెచ్ఇఒలతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ మాతా శిశు మరణాలు సంభవించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా పక్కాగా అమలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు తమ పరిధిలోని గిరిజనులకు ప్రభుత్వపరంగా అందుబాటులో ఉన్న వైద్య సేవలు గురించి ఆశా, ఎఎన్ఎంలు ద్వారా అవగాహన కల్పించాలని అన్నారు. పిల్లల ఆరోగ్యానికి సంభందించి పునరుత్పత్తి పోర్టల్ లో వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, అలాగే పిల్లల మనుగడ, సురక్షిత మాతృత్వం రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదికలను రీకన్సలేషన్ చేసుకోవాలని తెలిపారు. డేటా ఎంట్రీకి అవసరమైన శిక్షణను ఎఎస్ఎం, ఎంపిహెఇఓలకు ఇచ్చేందుకు రాజమండ్రి సర్వజన ఆసుపత్రి నుంచి ఒక డేటా ఎంట్రీ ఆపరేటరును పునఃశ్చరణ తరగతులకుగాను నియమించడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉపకేంద్రాలకు నెట్ వర్క్ కన్టెవిటీ ఉండేలా చర్యలు తీసుకుంటామని, మాతా శిశు మరణాలు నివారణలో అంగన్వాడీ కేంద్రాల సహకారంతో క్షేత్రస్థాయి సిబ్బంది కీలకంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో ఎడిఎంహెచ్ఓ డాక్టర్ బి.వినోద్ కుమార్, డిఎంఒ పి.వి. సత్యనారాయణ, అసిస్టెంట్ డిఎంఒ వెంకటేశ్వరరావు, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కార్తిక్, హెల్త్ మోనటరింగ్ సెల్ డాక్టర్ అప్పారావు, వివిధ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు చెందిన వైద్యులు, ఎంపిహెచ్ఇఒలు, తదితరులు పాల్గొన్నారు. 
 

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us