ఏజన్సీలో టానేజర్ సేవా సంస్థ సేవలు అభినందనీయం

UPDATED 27th JUNE 2020 SATURDAY 7:30 PM

గంగవరం(రెడ్ బీ న్యూస్): కరోనా కష్టం కాలంలో ప్రజలకు ప్రభుత్వంతో పాటుగా కొన్ని స్వచ్చంద సేవా సంస్థలు పేద ప్రజలకు అండగా నిలిచాయని, ఏజన్సీలో టానేజర్ సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి, డీసీసీబీ చైర్మన్ అనంత ఉదయభాస్కర్ (బాబు) అన్నారు. టానేజర్ సంస్థ జిల్లా మేనేజర్ పి. ప్రవీణ్ ఆధ్వర్యంలో లోతట్టు గిరిజన గ్రామాల్లో 475 గిరిజన రైతు కుటుంబాలకు కోవిడ్-19 రిలీఫ్ కిట్లను శనివారం ఎమ్మెల్యే ధనలక్ష్మి, అనంతబాబు చేతులమీదుగా పంపిణీ చేశారు. మండలంలో చీడిపాలెం, పండ్రపోలు, నూగుమామిడి, లక్ష్మీపురం గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే, అనంతబాబు గిరిజనులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, సేవా సంస్థలు అందిస్తున్న సేవలను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని ఇందుకోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని, రైతులకు 90 శాతం రాయితీకే విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. టానేజర్ సంస్థ జీడి మామిడి రైతుల కోసం పని చేస్తున్న సంస్థ అని, కరోనా కారణంగా అనేక మంది జీడిమామిడి రైతులు నష్టపోయారని, అటువంటి రైతులకు ఈ కిట్లు అందించడం ఎంతో సంతోషాదాయకమన్నారు. టానేజర్ సంస్థ జిల్లా మేనేజర్ ప్రవీణ్ మాట్లాడుతూ తమ సంస్థ ఏజన్సీలో గంగవరం, అడ్డతీగల, రంపచోడవరం మూడు మండలాల్లో పని చేస్తుందని రెండు వేల మంది రైతులకు ఈ కిట్లును ఇవ్వడం జరిగిందన్నారు. ఎంపీడీవో జాన్ మిల్టన్ మాట్లాడుతూ ఉపాధి పనులను గిరిజనులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులలో జిల్లాలో మన మండలం అగ్రస్థానంలో ఉందన్నారు. జాబ్ కార్డు ఉన్న ప్రతీ ఒక్కరూ పనులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. టానేజర్ సంస్థ ప్రతినిధులు ఎస్.వి. రామారావు, బి. అనిల్, టి. రామకృష్ణ, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ అప్పలరాజు, మండల ఇన్‌ఛార్జ్ రఘు, నాయకులు ప్రభాకర్, తోట రాజేశ్వరరావు, ఏడుకొండలు, బేబి, గంగాదేవి, పావని, తిరుపతి రావు, నారాయణరావు, దాసరి వెంకటేశ్వరరావు, శ్రీను, రమణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
 • Home
 • About Us
 • Politics
 • Crime
 • Devotional
 • Education
 • Entertainment
 • General
 • Business
 • Information
 • Gallery
 • Contact Us