UPDATED 29th NOVEMBER 2022 5:15 PM
YS Sharmila Arrest : తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అరెస్ట్ ఘటనపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి స్పందించారు. షర్మిల అరెస్ట్ వ్యక్తిగతంగా బాధాకరం అన్నారాయన. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన సజ్జలకు.. షర్మిల్ అరెస్ట్‌పై ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి ఆయన స్పందించారు. షర్మిల అరెస్ట్ బాధాకంర అంటూనే.. ఆమె పార్టీ వేరు, తమ పార్టీ వేరు అని తేల్చి చెప్పారు.
”మా నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మా ముఖ్యమంత్రి జగన్ సోదరి షర్మిల. ఆమె పట్ల తెలంగాణలో జరిగిన ఘటన మాకు వ్యక్తిగతంగా బాధ కలిగించింది. అయితే, షర్మిల పార్టీ వేరు, మా పార్టీ వేరు. వైసీపీకి, షర్మిల పార్టీకి సంబంధం లేదు. రాజకీయంగా షర్మిల స్టాండ్ వేరు, వైసీపీ స్టాండ్ వేరు. ఆమె రాజకీయ విధానాలపై స్పందించబోము” అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.
సోమవారం నర్సంపేటలో షర్మిల వాహనంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై షర్మిల ఫైర్ అయ్యారు. ‘ప్రగతి భవన్ ముట్టడి’ పేరుతో నిరసన కార్యక్రమం తలపెట్టారు.







