UPDATED 26th AUGUST 2017 SATURDAY 7:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులని ఆహ్వానిస్తూ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఫ్రెషర్స్ డే వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ జూనియర్ విద్యార్థులకు అవసరమైన సలహాలను అందిస్తూ తమ లక్ష్య సాధనకు కృషిచేసే విధంగా దిశానిర్దేశం చేయడంలో సీనియర్ విద్యార్థులు కీలకపాత్ర పోషించాలన్నారు. విద్యార్థుల మధ్య సహృద్భావ వాతావరణం పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులు తమలోని సాంస్కృతిక నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఈ వేదిక జూనియర్ విద్యార్థులకు చక్కటి అవకాశం కల్పిస్తుందన్నారు. అనంతరం కళాశాలకు చెందిన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఐటి ఇంజనీరింగ్ విభాగాల విద్యార్థుల్లోని నైపుణ్యాలకు మెరుగుపెట్టే విధంగా నాట్య ప్రదర్శనలు, ఏకపాత్రాభినయాలు, స్కిట్స్, క్విజ్ తో పాటు పలు అంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ఎం.వి. హరనాథ్ బాబు, డైరెక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి.నరేష్, పలు విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.







