IJU: ఐజేయు జాతీయ సభ్యుడు రాంబాబుకు సత్కారం

UPDATED 28th SEPTEMBER 2022 WEDNESDAY 05:00 PM

Indian Journalists Union : ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ సభ్యుడుగా ఎన్నికైన రాకుర్తి రాంబాబును పెద్దాపురం ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా) సభ్యులు బుధవారం ఘనంగా సత్కరించారు. పెద్దాపురం ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పచ్చిపాల ప్రసాదరావు అధ్యక్షత జరిగిన సభలో క్లబ్ గౌరవ అధ్యక్షుడు మొల్లి సూర్యనారాయణ మాట్లాడుతూ మన పెద్దాపురం పట్టణానికి జాతీయస్థాయిలో రాంబాబు గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. క్లబ్ అధ్యక్షుడు ప్రసాదరావు మాట్లాడుతూ పాత్రికేయులు సమస్యలపై తక్షణమే స్పందించే వ్యక్తి రాంబాబు అని, అలాంటి వ్యక్తికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం అభినందనీయమన్నారు.

ఐజేయు జాతీయ సభ్యుడు రాకుర్తి రాంబాబు మాట్లాడుతూ అధికారులు, ప్రజా ప్రతినిధులతో చర్చించి అర్హత కలిగిన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు ఇళ్ళ స్థలాల మంజూరు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కృషి చేస్తానన్నారు.

ఈ కార్యక్రమంలో పాత్రికేయులు చవ్వాకుల ఈశ్వరరావు, పిడపర్తి విక్రమశాస్త్రి, పాసిల ప్రసాద్, బోదిరెడ్డి బుజ్జిబాబు, బుద్ది కుమార్, శ్రీరామ్, సిద్దాంతపు సుబ్బారావు, షేక్ అప్సర, వినాయక్, రాయవరపు వీరబాబు, ఫర్ ద పీపుల్ ఫౌండేషన్ చైర్మన్ గుణ్ణం లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us