UPDATED 21st NOVEMBER 2022 MONDAY 5:40 PM
Kodali Nani : గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంపై టీడీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కొడాలి నాని దూకుడు చెక్ పెట్టేందుకు టీడీపీ హైకమాండ్ కసరత్తు చేస్తోంది. కొడాలిని ఢీకొట్టేందుకు వ్యూహాలు రచించిన టీడీపీ.. కొడాలిపై పోటీకి ఎన్నారైను రంగంలోకి దించే ప్లాన్ చేస్తోంది. ఈసారే ఎన్నారై వెనిగళ్ల రామును బరిలోకి దింపేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించింది. రాము అభ్యర్థిగా చంద్రబాబు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం. దీంతో కొన్నాళ్లుగా నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు రాము కుటుంబసభ్యులు. వచ్చే నెల నుంచే గుడివాడలోనే వెనిగళ్ల రాము ఉంటాడని టీడీపీ నేతలు చెబుతున్నారు.







