UPDATED 19th OCTOBER 2022 WEDNESDAY 08:00 PM
Thirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 24న దీపావళి ఆస్థానం, అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం కారణంగా ఈ మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలను టిటిడి రద్దు చేసింది. అక్టోబర్ 24న దీపావళి ఆస్థానం కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 23న సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు తెలిపారు.
అక్టోబరు 25న మంగళవారం సూర్యగ్రహణం రోజున ఉదయం 8 నుంచి రాత్రి 7.30 గంటల వరకు దాదాపు 12 గంటలు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారని, ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున అక్టోబర్ 24న సిఫార్సు లేఖలు స్వీకరించబడవన్నారు.. నవంబరు 8న చంద్రగ్రహణం రోజున ఉదయం 8.30 నుండి రాత్రి దాదాపు 7.30 గంటల వరకు శ్రీవారి ఆలయ తలుపులు మూసి ఉంచుతారు. ఈ కారణంగా బ్రేక్ దర్శనం రద్దు చేసినందున నవంబరు 7న సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అక్టోబరు 25న సూర్యగ్రహణం, నవంబరు 8న చంద్రగ్రహణం రోజుల్లో శ్రీవాణి, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కూడా టిటిడి రద్దు చేసింది.







