Instagram: వచ్చే ఏడాది సరికొత్తగా ఇన్‌స్టాగ్రామ్‌.. ఏం చేస్తారంటే?

వెల్లడించిన ఇన్‌స్టాగ్రామ్‌ హెడ్‌ ఆడమ్‌ మోస్సేరి

రెడ్ బీ న్యూస్, 30 డిసెంబర్ 2021‌: యువత అత్యధికంగా వాడే యాప్‌ల్లో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ ఒకటి. సెలబ్రెటీల నుంచి సామాన్యుల వరకూ తమ జీవితాల్లో జరిగే విషయాలను ఈ వేదికలో పంచుకోవడం సర్వసాధారణం. అలాంటి ఈ యాప్‌ 2022లో ఎలా ఉండబోతుంది. ఇన్‌స్టా టీమ్‌ ఆలోచనలు ఏంటి అనేది ఇన్‌స్టాగ్రామ్ హెడ్‌ ఆడమ్ మోస్సేరి వివరించారు. ‘‘2021లో ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధానంగా వీడియో ఫార్మాట్‌పైనే మీద దృష్టి సారించాం. రీల్స్‌ ఆప్షన్‌ను పరిచయం చేశాం. క్రియేటివ్‌ టూల్స్‌ని అందుబాటులోకి తీసుకొచ్చాం. సున్నితమైన, ద్వేషపూరిత అంశాలను కంట్రోల్‌ చేసే వెసులుబాటును ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు కల్పించాం. లైక్ కౌంట్స్‌ను హైడ్‌ చేసే ఆప్షన్‌ కూడా తీసుకొచ్చాం. మెసేజింగ్‌లోనూ మార్పులు చేశాం’’ అని ఆడమ్‌ చెప్పారు. ఇక 2022లో ‘ఇన్‌స్టాగ్రామ్‌’ మరింత కొత్తగా ఉండనుందని ఆడమ్‌ తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ను కేవలం ఫొటో షేరింగ్ యాప్‌లా మాత్రమే కాకుండా... అన్ని ఫార్మట్లకు వేదికగా ఉండేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆ దిశగా రీల్స్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. ‘మెసేజింగ్‌’ ఫీచర్‌ పైనా మరింత దృష్టి పెడతాం. వినియోగదారుల విషయంలో పారదర్శకతనూ పెంచుతాం. ఇన్‌స్టా ద్వారా డిజిటల్‌గా కమర్షియల్‌ ప్రొడక్ట్స్‌ అమ్మేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యాపారవేత్తల నుంచి వ్యక్తిగతంగా ఎదగాలనుకునేవారికి ఈ ఆప్షన్‌ తోడ్పడనుంది అని ఆడమ్‌ వివరించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us