UPDATED 23rd JUNE 2017 FRIDAY 2:00 PM
పెద్దాపురం: అంతర్జాతీయ ఒలెంపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 160 దేశాల ఒలెంపిక్ సంఘాల సారథ్యంలో శుక్రవారం ఒలెంపిక్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్సాహంగా ఒలెంపిక్ రన్ నిర్వహించారు. ఈ ఒలెంపిక్ రన్ లో శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్ విద్యార్థులతో పాటు పలు పాఠశాలలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ ఒలెంపిక్ రన్ ను మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు , పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ పట్టణంలోని పలు వీధులు గుండా సాగింది. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఒలెంపిక్ రన్ కన్వీనర్ మాకాల సతీష్, ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొత్త వీరన్న, పిఈటీలు శ్రీనివాస్, ప్రసాద్, సంజన, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.







