UPDATED 27th APRIL 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్టేషన్ సెంటర్ లో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు విస్తరణలో భాగంగా షాపులు కోల్పోయిన వ్యాపారస్తులకు న్యాయం చేస్తామని, షాపులు కోల్పోయిన పది మందికి బసివిరెడ్డి సత్రం ఖాళీ స్థలంలో తాత్కాలిక షెడ్లుకు అనుమతి ఇవ్వాలని సత్రం ఈవో ఎ. రవిశంకర్ ను ఆదేశించారు. అలాగే సత్రంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి ఐదు రూపాయల టిఫిన్, భోజనం అందిస్తామని చెప్పారు. ఆటోలు పార్కింగ్ చేసుకోవడానికి స్థలం లేకుండా పోయిందని ఆటో యూనియన్ నాయకులు మంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్, భీమేశ్వరస్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు, కౌన్సిలర్ మన్యం చంద్రరావు, షాపుల యజమానులు, తదితరులు పాల్గొన్నారు.







