Updated 5th May 2017 Friday 11:30 AM
పెద్దాపురం: నీ పనితీరు మార్చుకో లేకపోతే చిక్కుల్లో పడతావ్ అంటూ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం మండలం జి.రాగంపేట గ్రామకార్యదర్శి రమేష్ బాబు పై గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజలకు అందే సౌకర్యాల కల్పనలో కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరించడం పై ఆయన పై విధంగా స్పందించారు. గ్రామంలో పర్యటించిన హోం మంత్రికి పలువురు గ్రామస్థులు కార్యదర్శి పై ఫిర్యాదు చేశారు. చేతిపంపులు మరమత్తులు చేయించకపోవడం, ఇంకుడు గుంతల విషయంలో నాణ్యతాలోపం కరెంటు బకాయిలు చెల్లించకపోవడం మొదలైన సమస్యలపై గ్రామస్థులు హోం మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో పై విషయాలపై విచారణ చేపట్టాలని ఆర్డీవో విశ్వేశ్వరరావును హోం మంత్రి ఆదేశించారు. అనంతరం గ్రామంలో పంచాయతీ నిధులు రూ.10 లక్షలు వ్యయంతో నిర్మించతలపెట్టిన సామాజిక భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గుడాల రమేష్, తహసీల్దార్ గోగుల వరహాలయ్య, ఎంపిడివో వసంతమాధవి, పంచాయతీ రాజ్ డిఈ హరనాథరావు, మండల కోఆప్షన్ సభ్యుడు బొడ్డు వెంకన్న, తెలుగు యువత మండలాధ్యక్షుడు నూనె రామారావు, దేవళ్ళ వరప్రసాద్ (బోసు) ఆచంట రాజన్న(రాజబాబు) జల్దాని సుబ్రహ్మణ్యం (బాబీ) తదితరులు పాల్గొన్నారు







