UPDATED 22nd SEPTEMBER 2022 THURSDAY 09:00 PM
Vijayendra Saraswathi: కంచి కామకోటి పీఠం 70వ పీఠాధిపతి జగద్గురువులు శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కాకినాడ (Kakinada ) జిల్లా పెద్దాపురం (Peddapuram) మండలంలోని కట్టమూరు (Kattamuru ) గ్రామంలో కొలువైఉన్న రాజరాజేశ్వరీ సమేత రామలింగేశ్వరస్వామి (Ramalingeswaraswamy) వారిని గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆయనకు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు.
స్వామి దర్శనం అనంతరం భక్తులను ఉద్దేశించి ఆయన అనుగ్రహ భాషణం చేశారు. అలాగే భక్తులకు ఆయన చేతులు మీదుగా ప్రసాదాలను వితరణ చేశారు . ఈ కార్యక్రమంలో శ్రీ లలితా ఇండస్ట్రీస్ (Sri Lalitha industries) మేనేజింగ్ డైరెక్టర్లు మట్టే సత్యప్రసాద్ (Matte Satyaprasad), మట్టే శ్రీనివాస్ (Matte Srinivas) తదితరులు పాల్గొన్నారు.







