ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు అందచేత

UPDATED 3rd JULY 2018 TUESDAY 8:00 PM

సామర్లకోట: పెద్దాపురం నియోజకవర్గానికి చెందిన 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వైద్యఖర్చులు నిమిత్తం రూ.7 లక్షల12 వేలు 926 గల చెక్కులను రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అచ్చంపేటలో తన స్వగృహంలో బాధితులకు మంగళవారం అందచేశారు. పెద్దాపురంకు చెందిన బండారు సూరిబాబు రూ.50 వేలు, సామర్లకోటకు చెందిన మాసిన వెంకటరాజు రూ.ఒక లక్షా 15 వేల 846, పెద్దాపురంకు చెందిన పి. వెంకటలక్ష్మి రూ.35 వేలు, కాండ్రకోటకు చెందిన మోతపల్లి శ్రీనుకి రూ.20 వేలు, మేడపాడుకు చెందిన పోతుల నాగలక్ష్మి రూ.23 వేలు, పెద్దాపురంకు చెందిన అల్లమూరి మంగ రూ. 45 వేలు, పెద్దాపురంకు చెందిన మట్టపర్తి నవీన్ కుమార్ కు రూ.41 వేల710, సామర్లకోటకు చెందిన ఉట్టకూరి శ్రీదేవి రూ. 40 వేలు, బోయినపూడికి చెందిన పుప్పల శ్రీను రూ.30 వేలు, పెద్దాపురంకు చెందిన రాజమండ్రపు రవికుమార్ రూ.  53 వేల190, మేడపాడుకు చెందిన ఇనుపకొల్లి వి.ఎన్.ప్రసాద్ రూ. లక్షా 5 వేల10, చోడిశెట్టి జలారాణి రూ. 24 వేల 170, బోయినపూడికి చెందిన పుప్పల సరోజిని రూ. 50 వేలు, పెదబ్రహ్మదేవంకు చెందిన కొరిప్రోలు నాగలక్ష్మి రూ.  50 వేలు, చంద్రంపాలెంకు చెందిన కూనపురెడ్డి వీర వెంకట సత్యనారాయణ రూ. 30 వేలు రూపాయలు చెక్కులను మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట ఎంపిపి ఆకునూరి సత్తిబాబు, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ఏఎంసి వైస్ చైర్మన్ అడబాల చిట్టిబాబు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టినాని, గుమ్మళ్ళ రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us