AP News:పీఆర్సీ జీవోల అమలుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర

UPDATED 21 JANUARY 2022 FRIDAY 02.30 PM

అమరావతి (రెడ్ బీ న్యూస్) : ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.జగనన్న స్మార్ట్ టౌన్ షిన్లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉద్యోగులకు20 శాతం రిబేట్.. పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు ఆమోదముద్ర వేసింది. 'ఈబీసీ నేస్తం' చెల్లింపులతో పాటు వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఏడాది పాటు ఈ ఒప్పందం అమలుకు రూ.20 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదం సమ్మతించింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టుకు పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us