UPDATED 9th MAY 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక స్త్రీశక్తి భవనంలో పెద్దాపురం క్లస్టర్ పరిధిలోని పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ, కొత్తపల్లి మండలాలకు సంబంధించి 2017 -2018 సంవత్సరం ఆదాయ వ్యయాలు, మండల సమాఖ్య నిర్వహణ రిజిస్టర్లు నిర్వహణ తదితర వాటిపై వెలుగు సమాఖ్యల ఆడిట్ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ బృందం సభ్యులు కిరణ్ కుమార్, మూర్తి శ్రీనివాస్, ఏరియా కో-ఆర్డినేటర్ బాబూరావు, జగదీశ్వరి, రవికుమార్, రాజకుమారి, వెంకటరమణ, మండల సమైక్య ప్రతినిధులు, ఎపిఎంలు, తదితరులు పాల్గొన్నారు.







