నృత్య కళాకారుడు ప్రసాద్ కు శ్రీశైల నాట్య ప్రభ అవార్డు

UPDATED 14th FEBRUARY 2018 WEDNESDAY 9:30 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ నృత్య కళాకారుడు అలమండ ప్రసాద్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రసిద్ధ శ్రీశైలంక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సాయి నృత్యాంజలి పాయింట్ పార్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన జాతీయస్థాయి శివరాత్రి సత్య స్థానాలలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం విశేషంగా ఆకట్టుకుంది. ఈ నెల 11,12 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి నృత్య ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, కేరళ, ఒరిస్సా, మహారాష్ట్ర ల నుంచి సుమారు 150 మంది కళాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసాద్ కనబరిచిన ఉత్తమ ప్రదర్శనకు నృత్యోత్సవ నిర్వాహకులు నాట్యగురు పి. సురేష్, మునుకుంట్ల సాంబశివ, నాట్యగురువు సౌభాగ్య లక్ష్మి, మాదరి దేవకి వెంకటేశ్వర్లు తదితరులు శ్రీశైల నాట్య ప్రభ అవార్డుతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ప్రసాద్ ను రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మాజీ ఎంమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు, మున్సిపల్ చైర్మన్ మన్యం పద్మావతి, వైస్ చైర్మన్ యార్లగడ్డ శివప్రసాద్, సీనియర్ కళాకారులు నవలా రచయిత అంబటి అప్పారావు, స్థానిక కంచి మహా సంస్థానాధిపతి  బ్రహ్మశ్రీ చంద్రాభట్ల చింతామణి గణపతి శాస్త్రి, తదితరులు అభినందించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us