UPDATED 19th JULY 2022 TUESDAY 08:00 AM
Graduate MLC Elections: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది వైసీపీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం వైఎస్ జగన్ సమావేశమయ్యారు. ఎమ్మేల్యేలంతా ఏకాభిప్రాయంతో పోటీ చేసేందుకు అనుమతి కోరగా సీఎం ఆమోదించారు. గతంలో ఈ ఎన్నికలకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఈ సారి పోటీ చేద్దామని సూచించారు.
ప్రాంతాల వారీగా సమావేశం:
సచివాలయంలో జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం సమావేశమ్యారు. మొదటిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలున్న ఉమ్మడి విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారిగా సమావేశమయ్యారు. ఆ తర్వాత గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలున్న ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ అయ్యారు. తదుపరి ఒక గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలుఉన్న ఉమ్మడి ఒంగోలు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మాట్లాడారు.
ఈ సమావేశాల్లో గ్రాడ్యుయేట్, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీపై సంబంధిత జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అభిప్రాయాలు స్వీకరించి ముఖ్యమంత్రి సమ్మతిని తెలియజేశారు. వచ్చే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల ఏకాభిప్రాయాన్ని ఆమోదించారు.







