UPDATED 23 JANUARY 2022 SUNDAY 12:00 PM
అనంతపురం (రెడ్ బీ న్యూస్): నగరంలో చిట్టీల పేరుతో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. విద్యుత్‌నగర్‌కు చెందిన జయలక్ష్మీ అనే మహిళ రూ. 20 కోట్లకు కుచ్చుటోపీ పెట్టింది. ఉన్న ఫలంగా ఇంటిని ఖాళీ చేసి వెళుతుండగా బాధిత మహిళలు వెంబడించి పోలీసులకు అప్పగించారు. బాధిత మహిళలపై ఎస్ఐ రాఘవరెడ్డి మండిపడ్డారు. ఎవరినడిగి చిట్టీలు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎస్‌లో చిట్టీల నిర్వాహకురాలు జయలక్ష్మికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని బాధిత మహిళలు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు.







