అమరావతి (రెడ్ బీ న్యూస్) 30 డిసెంబర్ 2021: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్‌ల ధరలు నిర్ణయించేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ రేపు సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కమిటీ రేపు మధ్యాహ్నం సమావేశం కానుంది. టికెట్ల ధరల నిర్థారణ, థియేటర్ల వర్గీకరణ అంశాలపై హోమ్‌శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్ నేతృత్వంలో 13 మందితో కమిటీని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఎగ్జిబిటర్లు, డిస్టిబ్యూటర్లు, సినీ బయ్యర్లు, నిర్మాతల విజ్ఞప్తులను కమిటీ పరిశీలించనుంది.







