పరిశుభ్ర గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం

UPDATED 17th SEPTEMBER 2017 SUNDAY 7:00 PM

సామర్లకోట: పరిశుభ్ర గ్రామాలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.  సామర్లకోట మండలం పనసపాడు గ్రామంలో ఏర్పాటు చేసిన "స్వచ్ఛతే సేవా" కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం స్వచ్ఛతే సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యవంతంగా ఉంటారని తద్వారా అభివృద్ధికి ఆస్కారం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పేద ప్రజలకు మరుగుదొడ్లు నిర్మించుకునేనేందుకు రూ. 15 వేలు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో మెరుగైన రహదారుల నిర్మాణానికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. అలాగే గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పనసపడు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడంతో పాటు బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మారుస్తామన్నారు. అనంతరం  జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లాలో నూరు శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణానికి చర్యలు తీసుకుని జిల్లాను వోడీఎఫ్ జిల్లాగా మారుస్తామన్నారు. ఆక్టోబర్ రెండవ తేదీ నాటికి స్వచ్ఛతే సేవా కార్యక్రమంలో ఎక్కువగా పాల్గొన్నవారికి అవార్డులు అందచేయడం జరుగుతుందన్నారు. రాబోయే రెండు నెలల్లో అన్ని ఇళ్ళకు మరుగుదొడ్లు నిర్మించి బహిరంగ  మలవిసర్జనరహిత  జిల్లాగా ప్రకటిస్తామన్నారు. అనంతరం స్వచ్ఛతే సేవా విషయంపై ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ -2  జె. రాధాకృష్ణమూర్తి, జిల్లా పంచాయతీ అధికారి టి.వి.ఎస్.జి. కుమార్, డీఆర్డీఏ పిడి మల్లిబాబు, కాకినాడ ఆర్డీవో ఎల్. రఘుబాబు, డిప్యూటీ సీఈవో సుబ్బారావు, గ్రామ సర్పంచ్ శెట్టిబత్తుల సత్యనారాయణ , ఉప సర్పంచ్ వెంకటేశ్వరావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.      
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us