UPDATED 5th AUGUST 2017 SATURDAY 7:00 PM
సామర్లకోట: కార్పొరేషన్ ద్వారా బ్యాంకు ఋణాలు పొందిన ప్రతీ కుటుంబం ఆర్ధికంగా అభివృద్ధిలోకి రావాలని హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయం లో మండల పరిషత్ ద్వారా కాపు, బిసి, ఎస్సి కార్పొరేషన్ ద్వారా మండల పరిధిలోని 240 మందికి రూ. 2.31 కోట్లు బ్యాంకు ఋణాల మంజూరు పత్రాలను ఆయన చేతుల మీదుగా లబ్ధిదారులకు శనివారం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపు, బిసి, ఎస్సి వర్గాలకు చెందిన వారికి బ్యాంకు ద్వారా రాయితీపై వ్యాపారాలు చేసుకునేందుకు ఋణాలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ ఋణాల ద్వారా నెలకు రూ.10000 ఆదాయం సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో పేదల అవసరాల మేరకు సహకారం అందిస్తున్నట్లు చెప్పారు. అలాగే చంద్రన్నబీమా పథకం ప్రవేశ పెట్టిందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే త్వరలో అందరికీ ఆమోదయోగ్యమైన గృహాలను నిర్మించనున్నట్లు హోం మంత్రి పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో మెరుగైన రహదారుల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సర్పంచ్, జెడ్పిటిసి, ఎంపిటిసి లు ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములై వేగవంతంగా పనులు జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి గొడతామార్త, జెడ్పిటిసి గుమ్మళ్ళ విజయలక్ష్మి, వైస్ ఎంపిపి సత్తిబాబు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చైర్మన్ అడబాల కుమారస్వామి, తోటకూర శ్రీనివాస్, ఎంపిడివో నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.







