Sarkaru Vaari Paata: ముహూర్తం పెట్టేసిన మహేశ్.. వాలంటైన్స్ డే రోజున ఫస్ట్ సింగిల్

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం వచ్చేస్తుంది. మహేష్-కీర్తి సురేష్ జంటగా యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ సర్కారు వారి పాట చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ పరుశురామ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని సమ్మర్ కానుకగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తుండగా.. ప్రేక్షకులలో హైప్ పెంచే పనిలో పడింది యూనిట్. ప్రేమికుల దినోత్సవం నుంచి ఈ మూవీ మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించబోతోన్నామని చిత్రయూనిట్ ప్రకటించింది.

సర్కారు వారి పాట నుంచి రాబోతోన్న ఈ ఫస్ట్ సింగిల్.. మెలోడీ సాంగ్ ఆఫ్ ది ఇయర్‌గా నిలవబోతోంది. ఈ పాటను ఫిబ్రవరి 14న విడదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ అద్భుతమైన పాటలను అందించాడు. వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోన్న ఈ పాట మహేష్ బాబు, కీర్తి సురేష్‌ల మీద రొమాంటిక్‌గా చిత్రీకరించినట్లు తెలుస్తుంది.

ఇప్పటికీ ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ మహేశ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉండగా.. మహేష్ మోకాలికి సర్జరీ, మహేశ్, కీర్తి సురేష్‌లు కరోనా బారిన పడటంతో షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కూడా నిలిచిపోయింది. ఈ వేసవికి విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ సింగిల్ తో సర్కారువారిపాటకు సంబంధించిన అప్‌డేట్స్ మొదలు పెడుతున్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us