అమరావతి (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబర్ 2021: జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలపై వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. విశాఖ ఉక్కుపై పవన్ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. మిత్రపక్షం కేంద్రాన్ని నిలదీసే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామని గుర్తు చేశారు. దీనిపై వైకాపా కేంద్రంతో పోరాడుతోందన్నారు. పవన్ సినిమాలు ఆపాల్సిన ఖర్మ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. సినిమా టికెట్లపై ఒక పాలసీ తీసుకుని ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఒక్కో సినిమాకు పవన్ రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికే కాదు కేంద్రానికి రూ.121లక్షల కోట్ల అప్పు ఉందని వివరించారు.







