మంగళగిరి (రెడ్ బీ న్యూస్) 7 2021: గుంటూరు జిల్లా మంగళగిరిలో నలుగురు విద్యార్థులు అదృశ్యమయ్యారు. నిన్న ఉదయం పాఠశాలలో బ్యాగులు పెట్టి విద్యార్థులు బయటకు వెళ్లారు. విద్యార్థులు సాయంత్రం తిరిగి రావడం గమనించిన ఉపాధ్యాయులు.. తల్లిదండ్రులకు ఫిర్యాదు చేస్తామని వారిని హెచ్చరించారు. తల్లిదండ్రులు మందలిస్తారనే భయంతో విద్యార్థులు వెళ్లిపోయారు. పిల్లలు ఇంటికి వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అదృశ్యమైన విద్యార్థులు వెంకట్, ప్రభుదేవా, సంతోష్, వెంకీల కోసం పోలీసులు గాలిస్తున్నారు.







