ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి సహకరించాలని ఛైర్మన్ కు వినతి

UPDATED 31st AUGUST 2017 THURSDAY 12:30 PM

పెద్దాపురం : పెద్దాపురం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని కోరుతూ పెద్దాపురం మున్సిపల్ ఛైర్మన్ రాజా సూరిబాబురాజుకు పెద్దాపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే సభ్యులు వినతి పత్రాన్ని గురువారం అందచేశారు. ఈ సంధర్భంగా సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రాకుర్తి రాంబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు) ఆధ్వర్యంలో ఆయనకు విజ్ఞప్తి చేశారు. ప్రెస్ క్లబ్ సభ్యుల అవసరాలకు, సమావేశాలకు సంబంధించి పక్కా భవనం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని, భవన నిర్మాణానికి సహకరించాలని అలాగే స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంప్రసాద్, సుధాకర్, ఆలీ, వినాయక్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us